PPM: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నమోదైన సారా కేసులకు సంబంధించి ఇద్దరు ముద్దాయిలు, ఆరుగురు బెల్లం వ్యాపారులను తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కె. జయ ఎదుట హాజరుపరిచారు. మళ్లీ నాటు సారా తయారీ లేదా బెల్లం సరఫరాలో పట్టుబడితే రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.