సత్యసాయి: కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ‘తీర్థవాది’ వేడుకను ఘనంగా నిర్వహించారు. శ్రీవారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా భృగుతీర్థానికి చేరుకోగా, అక్కడ వసంత వల్లభ స్వామికి ప్రత్యేక అభిషేకం, చక్రస్నానం నిర్వహించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభానికి కట్టిన కంకణాన్ని విప్పే ధ్వజావరోహణ క్రతువును శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.