SDPT: జగదేవ్పూర్ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఇవాళ హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి రవి కుమార్, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి సమక్షంలో లెక్కింపు చేపట్టారు. గత 62 రోజుల్లో హుండీ ద్వారా రూ.14,19,800 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.