మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి తెలియని వారు ఉండరు. అతని కోసం భారత ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా వెతుకుతూనే ఉంది. దావూద్, అతని గ్యాంగ్.. దేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా, ఉగ్రవాద సంస్థలకు సహకరించడం.. ఇలా చాలా కార్యకలాపాలనే నిర్వహిస్తోంది. అందుకే… అతనిని పట్టుకోవడానికి జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) ఓ కీలక ప్రకటన చేసింది. అతని గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.25లక్షల రివార్డు ప్రకటించింది. అతని అనుచరులపై కూడా రివార్డు ప్రకటించడం గమనార్హం.
ఇబ్రహీం ముఠా భారత్‌లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతోందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముఠాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌తో పాటు పాకిస్థాన్ ఏజెన్సీలు, దేశంలోని ఉగ్రవాద సంస్థల సహకారంతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు.
దావూద్ తో పాటు అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం అలియాస్ హాజీ అనీస్, జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, ఇబ్రహీం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మీనన్ అలియాస్ టైగర్ మీనన్‌లు కూడా ఉగ్రవాద సంస్థలకు సహకరించినట్టు ఏజెన్సీ ఆరోపించింది. ఈ క్రమంలో ఛోటా షకీల్ పై రూ.20లక్షలు, అనీస్, చిక్నా, మెమన్ లపై (ఒక్కొక్కరిపై) రూ. 15లక్షల చొప్పున నగదు రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది.
దావూద్ అతని సహచరులు ‘డీ’ కంపెనీ – ఇబ్రహం గ్యాంగ్ భారత్దేశంలో స్మగ్లింగ్ చేయడానికి ఒక యూనిట్‌ను స్థాపించారని సంబంధించిన విచారణలో వెల్లడైందని, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నకిలీ భారత కరెన్సీ నోట్లు (ఎఫ్ఐసీఎన్) తరలింపుతోపాటు పాకిస్థాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థలతో సన్నిహితంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్టు తెలిందని ఎన్ఐఏ సీనియర్ అధికారి తెలిపారు.