TG: పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో హైదరాబాద్ కంపెనీ ద్రువ స్పేస్ తయారు చేసిన ఉపగ్రహాలు ఉన్నాయి. మొత్తం 15 ఉపగ్రహాల్లో ఈ సంస్థ ఏడు ఉపగ్రహాలు పంపినట్లు తెలుస్తోంది. కాగా, ఈ మిషన్ విఫలం కావడంతో ద్రువ్ స్పేస్ కంపెనీకి భారీగా నష్టం వచ్చినట్లు సమాచారం. ఇందులో విదేశీ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి.