VZM: స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో జాతీయ యువజన దినోత్సవాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వివేకానంద యువతకు మార్గదర్శకుడన్నారు. అనంతరం వ్యాసరచన, క్విజ్ పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.