MDK: మెదక్ వేస్లీ కళాశాల మైదానంలో డీపీవో, డిఏఆర్ మెదక్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న పోలీసు క్రీడా పోటీలకు సిబ్బంది నుంచి మంచి స్పందన లభించింది. ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు పలువురు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. క్రీడలతో ఐక్యత పెరగడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు.