AKP: మాకవరపాలెం మండలం బూరుగుపాలెం పంచాయతీలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా రూ.36లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఎంపీడీవో చాయసుధా బుధవారం పరిశీలించి నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సునీల్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.