BDK: తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడంపై వార్డు ప్రజలకు మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర అవగాహన కల్పించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా 14వ వార్డులో బుధవారం పర్యటించారు. స్థానిక కౌన్సిలర్ నిరుడు ఉపేంద్ర వార్డులోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వార్డులో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఛైర్పర్సన్ తెలిపారు.