SKLM: ప్రభుత్వాలు ఇటీవల గ్యాస్ ధరలను విపరీతంగా పెంచారని వాటిని వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్, బొత్స సంతోష్ డిమాండ్ చేశారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. వంట గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెంచడం సరికాదని వాటి ధరలను గతంలో కన్నా నేడు ఇంకా తగ్గించాలని ఆయన కోరారు.