VZM: ఈ ఏడాది ఎండల తీవ్రత దృష్ట్యా పార్టీ ఆవిర్భావ సభను రద్దు చేస్తున్నట్లు బొబ్బిలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, ఆహార వితరణ, పర్యావరణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పండుగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.