NRML: జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళల విద్య కోసం విశేషంగా కృషి చేసిన మహానుభావురాలని సంఘం నాయకులు కొనియాడారు. అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే దేశ మహిళల ఆశాజ్యోతి అని కొనియాడారు.