హైదరాబాద్: 28°C
క్రీడలు

మోదీ జోక్యం చేసుకోవాలి: మనికా బాత్రా

Advertisement

ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రాకు చోటు దక్కలేదు. దీనిపై ఆమె ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. నిరాశ వ్యక్తం చేసింది. జట్టు ఎంపిక పారదర్శకంగా జరగలేదని ఆరోపించింది. తనను ఎందుకు ఎంపిక చేయలేదనే విషయంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని చెప్పింది. జట్టు ఎంపికపై ప్రధాని మోదీ, క్రీడల మంత్రి జోక్యం చేసుకోవాలని కోరుతూ వారిని ట్యాగ్ చేసింది.

Advertisement

Advertisement