MHBD: తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు ఉప్పలయ్య- ధనమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు ధర్మారపు ప్రశాంత్ కుమార్ వివాహ వేడుక శనివారం కళ్యాణలక్ష్మి గార్డెన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై, నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.