BPT: జె.పంగులూరు మండలం చందలూరులో శనగల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. PACS ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాకు రూ. 5,875 మద్దతు ధరకు శనగలను కొనుగోలు చేస్తున్నట్లు ఏవో సుబ్బారెడ్డి తెలిపారు. మండల రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని తమ శనగలను మద్దతు ధరకు విక్రయించాలని పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు సూచించారు.