AP: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ భారీగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,526 మంది భక్తులు దర్శించుకోగా 26,664 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.41 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.