బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దాని స్వభావం వేడి. వేసవిలో ఎక్కువగా తింటే శరీరంలో అంతర్గత వేడి పెరుగుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు, తరచుగా ముక్కు నుంచి రక్తం పడేవారు, సహజంగానే శరీర తత్వం వేడిగా ఉండేవారు వేసవిలో బెల్లానికి దూరంగా ఉండటం లేదా చాలా తక్కువగా తీసుకోవడం మంచిది. బెల్లం తిన్నప్పుడు దాని వేడిని తగ్గించడానికి మజ్జిగ, సోంపు లేదా తగినంత నీరు తీసుకోవాలి.