కృష్ణా: కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలను వినేందుకు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో జి. సుధా ప్రవీణ్ తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి. సాయిబాబు హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.