కృష్ణా: పెనమలూరు మండలం యనమలకుదురు శివాలయంలో హుండీ నగదు మాయం కావడం కలకలం రేపింది. ఆలయ హుండీలో ఉన్న సుమారు రూ.10 లక్షల నగదు కనిపించకపోవడంతో ట్రస్ట్ ఛైర్మన్ సంఘ నరసింహారావు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.