సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో పీఎం సూర్య ఘర్ పథకంపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 11,987 ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లు మంజూరైనట్లు తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే కుటుంబాలకు ఈ అవకాశం కల్పిస్తామని తెలిపారు.