MNCL: దండేపల్లి మండలంలోని వెలుగనూరు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కరాటే పోటీలో బంగారు పతకాలు సాధించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్ ఫు కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పాఠశాలకు చెందిన శృతి, సాయి ప్రణవి, అంజు శ్రీ, అనుదీప్తి, శ్రీ నిత్య, జాష్ణవి, శ్రీష్మ, అవంతిక ప్రథమ స్థానం సంపాదించి బంగారు పతకాలు అందుకున్నారు.