AP: తిరుపతి జిల్లా యర్రావారి పాల్యం మండలంలో విషాదం నెలకొంది. నెరబైలు పంచాయతీ పరిధి పొలాల్లో రెండు ఏనుగులు మృతిచెందాయి. అడవి పందుల నుంచి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల కంచె తగిలి ఏనుగులు మరణించినట్లుగా తెలుస్తోంది. నెరబైలు ఫారెస్ట్ బంగ్లా సమీపంలో ఈ ఘటన జరగ్గా.. అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.