Orissa : పూరిలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒరిస్సా(Orissa)లో మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఒరిస్సాలోని పూరి నుంచి బెంగాల్ లోని హౌరా వరకు ఈ ట్రైన్ నడవనుంది.
ఒడిశా రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలును ప్రధాని మోదీ వీడియో కాన్పరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఇక రూ.8,200 కోట్ల విలువైన రైల్వే పనులకు ప్రధాని మోదీ (PM MODI) శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మొత్తం 15 వందే భారత్ రైళ్లు ప్రారంభించామని వెల్లడించారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో వందే భారత్ రైళ్లను రూపొందించినట్లు తెలిపారు. ఇక వందే భారత్ రైళ్ల ద్వారా సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు.. వివిధ రాష్ట్రాల మధ్య మత, సాంస్కృతిక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్త చేశారు. ప్రస్తుతం అమృతకాలంలో ఉన్నామన్న పీఎం.. సమైక్యంగా ఉండి ప్రపంచానికి మన సత్తా ఏంటో చాటాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఒడిశాలో రైల్ నెట్వర్క్ సంపూర్ణ విద్యుదీకరణ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. రైల్ నెట్వర్క్ (Rail network)సంపూర్ణ విద్యుదీకరణ వల్ల నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయిని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav), విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు