CTR: మహిళా దినోత్సవం సందర్భంగా సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయం ప్రజా దర్బార్లో మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కఠారి హేమలత పాల్గొన్నారు.