WGL: నెక్కొండ మండలం పనికర గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సామిల్& టింబర్ డిపోను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా రిబ్బన్ కటింగ్ చేసి మిషన్ని స్టార్ట్ చేసారు. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించాలని MLA నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.