WGL: జిల్లాలో అక్రమంగా పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఈ నెల 17న వేలం వేయనున్నట్లు కలెక్టర్ సత్య శారద, పౌరసరఫరాల శాఖ డీఎం సంధ్యారాణి ఇవాళ తెలిపారు. మొత్తం 2127.22 క్వింటాళ్ల బియ్యం నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో వేలం జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు సరకు విలువలో 10% మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలన్నారు.