NDL: బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను మంత్రికి వినిపించగా, వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, తదితరులు హాజరయ్యారు.