VZM: శృంగవరపుకోట మండలం గోపాలపల్లి గ్రామంలో అక్రమంగా ఆవులను చంపి కంపెనీలకు పంపిస్తున్న వారిపై వెంటనే రౌడీ షీట్లు తెరవాలని గో సంరక్షణ సమాఖ్య అధ్యక్షులు లోగిశ రామకృష్ణ డిమాండ్ చేశారు. గోపాలపల్లిలోని అక్రమ పశు వధశాలను తహశీల్దార్ శ్రీనివాసరావుతో కలసి ఇవాళ పరిశీలించారు. గో వధలు జరిగినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.