అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని కివీస్ కెప్టెన్ శాంట్నర్ వ్యాఖ్యానించాడు. అలాగే, సొంతగడ్డపై జరిగే ఫైనల్లో భారత్‌పై విజయం సాధించడం అంత సులభం కాదన్నాడు. భారత జట్టులో బుమ్రా మాత్రమే కాదు, ప్రతి ప్లేయర్‌తోనూ తమకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నాడు.