NLR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ, రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. మున్సిపల్ కమిషనర్ వై.వో నందన్ స్వయంగా రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, ప్రతి ఒక్కరూ దీనిని అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.