TG: కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం కూలేశ్వరం అని దుష్ప్రచారం చేస్తున్నారని BRS నేత హరీష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోటి మంది రైతులకు తాగునీరు ఇచ్చే ప్రాజెక్టుపై CM రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడిన ఆయన.. ఇప్పటికైనా మేడిగడ్ల పిల్లర్లకు రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే లక్షలాది ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు అందుతున్నాయన్నారు.