VSP: రుషికొండ బీచ్ రోడ్డులో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమ వాణిజ్య నిర్మాణాలు జరుగుతున్నాయని మత్స్యకార సంఘ ప్రతినిధి తెడ్డు శంకర్ ఆరోపించారు. అనుమతులు లేకుండా హోటల్ నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై మధురవాడ జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదన్నారు. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.