SKLM: ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా.. శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు కాశీబుగ్గ సాయిబుల కాలనీలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నలుగురు సీఐలు, ఈగల్ టీంతో కలిపి సుమారు 60 సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు.