HYD: రెజిమెంటల్ బజార్లో దీర్ఘకాలికంగా ఆస్తి పన్ను చెల్లించని లాడ్జిలపై GHMC అధికారులు కొరడా ఝుళిపించారు. న్యూ పంచవతీ లాడ్జి గత మూడేళ్లుగా రూ. 3 లక్షలకు పైగా బకాయి ఉండటంతో అధికారులు ‘రెడ్ నోటీసు’ జారీ చేశారు. పన్ను చెల్లింపుపై పలుమార్లు హెచ్చరించినా స్పందన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బకాయిలు చెల్లించేందుకు ఏడు రోజుల గడువు ఇచ్చామన్నారు.