T20 WC నిర్వాహకులపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరోసారి మండిపడ్డాడు. ఓవర్ మధ్యలో DJ ప్లే చేయడం వల్ల ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు. గతంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అనవసరంగా లేజర్ షో ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశాడు. కాగా, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ వేస్తుండగా, ఓవర్ మధ్యలోనే డీజే ప్లే చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు.