ATP: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో MRI స్కానింగ్, రేడియాలజిస్ట్ డాక్టర్ను నియమించాలని కోరుతూ మండల తహసీల్దార్ రమాదేవికి కిసాన్ కాంగ్రెస్ మాజీ ఎగ్జిక్యూట్ సభ్యుడు టీసీ.నారాయణరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే రోగులు MRI స్కానింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆస్పత్రిలో MRI స్కానింగ్ ఏర్పాటు చేయాలన్నారు.