AP: దివ్వెల మాధురి, తనూజపై చట్టపరమైన చర్యలకు టీటీడీ సిద్ధమైంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా కేక్ కటింగ్ చేయడంపై టీటీడీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, తిరుమలలో ఇలాంటి వేడుకలు పూర్తిగా నిషేధమని టీటీడీ తెలిపింది. కేక్ కట్ చేసి, వీడియో చిత్రీకరించి SMలో పోస్ట్ చేయడం సరికాదని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.