హైదరాబాద్: 28°C
క్రైమ్

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

Advertisement

TG: ఖమ్మం జిల్లా గాంధీనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరు చిన్నారులు వేదకుమార్(7), తనీష్(5) మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement