SRPT: సూర్యాపేట జిల్లా కలెక్టర్ హెల్మెట్ పై అవగాహన పెరిగేలా వినూత్న ఆలోచన చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోకి ప్రవేశించే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పక ధరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది హెల్మెట్ ధరించని వాహనదారులను కలెక్టరేట్లోకి అనుమతించడం లేదు.