TPT: తిరుపతి కొర్లగుంట మారుతీనగర్‌లో విషాదం నెలకొంది. నగరి మండలం గుండ్రాజుకుప్పానికి చెందిన దివ్య (20) మూడేళ్ల కిందట ప్రకాశ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 18 నెలల సితార అనే కుమార్తె ఉంది. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని భర్త దివ్యను మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.