పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమా టీజర్లో రాముడితో పాటు.. రావణుడి లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ పై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దాని దెబ్బకే దర్శకుడు ఓం రౌత్..
ఈ సినిమాను ఏకంగా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. విఎఫ్ఎక్స్ బెటర్మెంట్ కోసం ఇంకొంత సమయం కావాలంటూ.. జూన్ 16కు ఆదిపురుష్‌ను వాయిదా వేశాడు. దాంతో పోస్ట్‌పోన్ అయ్యాక.. ఆదిపురుష్‌లో ఎలాంటి మార్పులు చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ నేపథ్యంలో.. ఆదిపురుష్ గ్రాఫిక్స్ కోసం మళ్ళీ భారీగా ఖర్చు చేస్తున్నారని.. రీషూట్ చేస్తున్నారని వినిపిస్తోంది.
అయితే గ్రాఫిక్స్ పై ఫోకస్ చేశారు.. కానీ ఏ పాత్రలపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా ‘ఆదిపురుష్’ లో రావణ్‌గా కనిపించనున్న సైఫ్ అలీ ఖాన్ లుక్‌ను మార్చుతున్నట్టు తెలుస్తోంది. టీజర్లో కూడా రావణుడికి గెటప్ పైనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అందుకే సైఫ్ అలీఖాన్‌కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ను రీషూట్స్ చేస్తున్నారట.
దీంతో రావణ్ పాత్ర వేషధారణలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయని అంటున్నారు. బడ్జెట్ విషయంలోను మేకర్స్ తగ్గేదేలే అంటున్నారట. ఇప్పటికే బాలీవుడ్ సంస్థ టీ-సిరీస్ ఈ సినిమాకు 450 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు అదనంగా మరో 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు టాక్. మరి భారీ మార్పులతో వస్తున్న ఆదిపురుష్ ఎలా ఉంటుందో చూడాలి.