బీహార్ సీఎంగా ఉన్న నీతీష్ కుమార్ అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్ సభ ఎంపీగా ఇప్పటికే ప్రాతినిధ్యం వహించిన ఆయన.. రాజ్యసభ ఎంపీగా వెళ్లనుండటంతో అన్ని సభల్లోనూ సభ్యత్వం పొందిన నాయకుడిగా చరిత్ర సృష్టించనున్నారు. అయితే నాలుగు సభల్లోనూ పనిచేయాలని తన కోరిక అని కూడా నీతీష్ కుమార్ చెప్పిన విషయం తెలిసిందే.