ATP: గుంతకల్లులోని శాస్త్ర జూనియర్ కళాశాల ఎదుట గురువారం పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పీడీఎస్యూ నాయకులు వినోద్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు సేకరిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.