NLR: విజయవాడ-తిరుపతి–చెన్నై మార్గంలో ప్రయాణించే వాహనాలు నెల్లూరు నగరం మీదుగా వెళ్లాల్సి రావడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ.. అనేక చిన్న నగరాలకు కూడా ఔటర్ రింగ్ రోడ్లు, నగరం వెలుపల బైపాస్ రోడ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరమైన నెల్లూరుకు సమగ్ర ఔటర్ రింగ్ రోడ్ అవసరమని కోరారు.