AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల విస్తరణలో తొలగించే పురాతన చెట్లపై ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని చెప్పారు. నెలరోజుల్లో పాలసీ రూపొందిస్తామని వెల్లడించారు. అలాగే, కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం పూర్తి చేయని మల్టీ విలేజ్ స్కీమ్స్ పూర్తి చేస్తామని తెలిపారు.