NRML: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో గురువారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేసి పత్రాలను పరిశీలించారు. రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాలు, గంజాయి నివారణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.