»Megastar Chiranjeevi New Car Bought Cost Car Number And Other Details You Know
Chiranjeevi New Car కొత్త కారు కొన్న MegStar చిరంజీవి.. ధర ఎంత అంటే..?
ఫొటో, డిజిటల్ సంతకం వంటి ప్రక్రియ పూర్తి చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కి (Registration Certificate) దరఖాస్తు చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరో కొత్త కారు (New Car) కొనుగోలు చేశాడు. ఇప్పటికే చిరు వద్ద బోలేడు కార్లు ఉండగా.. అతడి గ్యారేజీలో మరో కారు చేరిపోయింది. కారు రిజిస్ట్రేషన్ (Registration)ను తెలంగాణలో చేసుకున్నాడు. ఇక కారు నంబర్ కోసం ఏకంగా రూ.4.70 లక్షలు చిరంజీవి చెల్లించాడు. కారు రిజిస్ట్రేషన్ కోసం రాగా.. ఆర్టీఏ కార్యాలయంలో సందడి వాతావరణం అలుముకుంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో మెగాస్టార్ (MegaStar)కు పనిని పూర్తి చేయించారు. ఏ కారు కొన్నారు.. కారు ప్రత్యేకతలు, ధర ఎంత? అనే వివరాలు తెలుసుకోండి.
కొత్తగా కొనుగోలు చేసిన కారు పేరు టొయోటా వెల్ ఫైర్ (Toyota Vellfire). దీని ధర అన్ని పన్నులు కలిపి దాదాపు రూ.1.9 కోట్లు ఉంటుందని సమాచారం. బర్నింగ్ బ్లాక్ కలర్ (Black Colour)లో ఉన్న కారును చిరు కొన్నాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం హైదరాబాద్ (Hyderabad) ఖైరతాబాద్ (Khairatabad)లోని ఆర్టీఓ కార్యాలయానికి (RTA Office) చిరంజీవి వచ్చారు. ఆర్టీఓ రామచంద్రం సమక్షంలో చిరు ఫొటో, డిజిటల్ సంతకం వంటి ప్రక్రియ పూర్తి చేశారు. కొణిదెల చిరంజీవి పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కి (Registration Certificate) దరఖాస్తు చేసుకున్నారు. ఆ కారు నంబరో ఎంతో తెలుసా? టీఎస్ 09 జీబీ 1111 చిరు కారుకు ఇచ్చారు. అయితే ఆ నంబర్ కోసం చిరంజీవి రూ.4.70 లక్షలు చెల్లించారు.