TG: HYD బంజారాహిల్స్‌లో భారీగా కల్తీ నెయ్యిని టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రైడ్ డెయిరీ పేరుతో నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి కేంద్రంలో తనిఖీలు చేపట్టి.. 460 కిలోల కల్తీ నెయ్యి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహ్మద్ జునైద్‌ను అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యిని పలు హోటళ్లకు, శుభకార్యాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.