VZM: గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చీపురుపల్లి వెలుగు కార్యాలయం వద్ద బుధవారం పెరటికోళ్ల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూనిట్లో 3 పుంజులు, 8 పెట్టెలు (మొత్తం 11) ఉంటాయని, ధర ₹4,500 అని ఏపీఏం అప్పలనాయుడు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు.