ATP: రాయదుర్గం పట్టణంలో చంద్రహాస్ మెడికల్ షాపులో స్వదేశీ దిశా కేరామృత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనుహ్య స్పందన లభించింది. మున్సిపల్ సానిటేషన్ ఉద్యోగుల కోసం ఉచిత దంత, కంటి పరీక్షలు నిర్వహించినట్లు సంస్థ ఏజెంట్ నాని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.